స్టాకహేోమ్ : సాహిత్యరంగంలో ఫ్రెంచ్ రచయిత్రి అన్నె ఎర్నాక్స్ (82) నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. జ్ఞాపకశక్తి మూలాలపై ఆమె రచించిన 'ఫర్ ద కరేజ్ ఆఫ్ అండ్ క్లినికల్ ఎక్యూటీ' రచన నోబెల్‌కు ఎంపికైందని జ్యూరీ తెలిపింది. ఎర్నాక్స్ ఈ ప్రతిష్టాత్మక బహుమతిని గెలుచుకున్న 17వ మహిళగా నిలిచారు. ఈ బహుమతి కింద ఆమెకి మెడల్, పది మిలియన్ స్వీడిష్ క్రోనర్‌లు అందుతాయని వెల్లడించింది. గతేడాది టాంజానియాలో జన్మించిన నవలా రచయిత అబ్దుల్ రజాక్ ఈ అవార్డును గెలుచుకున్నారు. శరణార్థులు, బహిష్కరణ, వలసవాదం, జాత్యహంకారంపై ఆయన రచనలు చేశారు. సోమవారం వైద్య రంగంలో, మంగళవారం ఫిజిక్స్, బుధవారం రసాయన శాస్త్రంలో వరుసగా అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాహత్యరంగంలో అవార్డుని ప్రకటించిన జ్యూరీ శుక్రవారం ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి అవార్డును ప్రకటించనుంది.










