వినతిపత్రం అందజేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు నియోజకవర్గం ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని, చనిపోయిన, దొంగ ఓట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాటిని తొలగించాలని కోరుతూ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్‌కు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం వినతి పత్రం అందజేశారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు చిలకపాటి మధు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, చదలవాడ కొండయ్య, పార్లమెంట్ కమిటీ నాయకులు గోచిపాతల మోషే ఉన్నారు.










