Feb 07,2023 09:43

జీ-20 ప్రతినిధుల పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

       లేపాక్షి : జి-20 దేశాల ప్రతినిధుల బందం మంగళవారం నాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కర్నాటక రాష్ట్రం పావగడ సోలార్‌ పార్క్‌ సందర్శన నిమిత్తం జి-20 దేశాల ప్రతినిధుల బందం మంగళవారం ఉదయం రానుంది. సోలార్‌ పార్క్‌ సందర్శన అనంతరం సాయంత్రం 4 గంటలకు లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం అనంతపురం ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. శ్రీసత్యసాయి జిల్లా కొడికొండ నుంచి చిలమత్తూరు, మడకశిర, పావగడ సోలార్‌ పార్కు వరకు ఉన్న రహదారిపై పర్యటించి క్షుణ్నంగా పరిశీలించారు. బందోబస్తు చర్యలపై ఆయా పోలీసు అధికారులకు దిశానిర్ధేశం చేశారు.