May 21,2022 06:45

జాగ్రత్త చెల్లీ !
కొందరి కడుపులో
కామపు నాగులు
పడుకుని ఉంటాయి

వారి చూపులో తేడా
వారి మాటలో తేడా
వారి నవ్వులో తేడా
వారి కరచాలనంలో తేడా

ఎక్కడ మాటు వేస్తారో
ఎప్పుడు కాటు వేస్తారో
ఎలా వేటు వేస్తారో
ఎప్పుడు రూటు మారుస్తారో

జాగ్రత్త తల్లీ!
రెండు కళ్ళతో కాదు
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని
ముందడుగు వెరు ...

కామపు నాగులు
బుసకొట్టే లోపే
వాటి కోరలు విరిగి
తోకలు ముడిచి
దేహం సచ్చుపడేలా
కొత్త సూది మందేదైనా
కనిపెట్టేసేరు ....

(ఇటీవల మహిళలు పై జరుగుతున్న అత్యాచారాలకు స్పందనగా)
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 9441791239