Feb 26,2022 19:44

భరతమాత ముద్దు బిడ్డలం
భావితరాలకు ప్రతినిధులం
జాతిని నడిపే సారథులం
మేమే మేము వారసులం...

కుల మత భేదం తెలియదు
శత్రుత్వం మా మధ్య లేదు
మేమందరం ఒక్కటే
మా అందరికీ భరతమాత అమ్మా...

మానవ సేవే మా అభిమతం
మదిలో ఎప్పుడు సంతోషం
సకలజనుల సౌభాగ్యం కోసమై
స్వాగత గీతం పాడుతాం...

శాంతి కోరే పువ్వులం
భరతమాత పాదాలకు మువ్వలం
జాతీయ పండుగే మాకిష్టం
జాతీయ జెండాలు మా చేతి సుందరం...

మా శిఖరమే హిమాలయ పర్వతం
మా మనసంతా గంగానది
మా దేశమే మాకు బృందావనం
సర్వమతాల నందనోద్యాన వనం..

భిన్నత్వంలో ఏకత్వం
ప్రపంచం మెచ్చే లౌకికతత్వం
చరిత్రకే నిదర్శనం
అమ్మ పాదాలే అందుకు సాక్ష్యం..

- కొప్పుల ప్రసాద్‌
9885066235