May 09,2022 07:22

అతను కలం కింద పెట్టాడు
అది కదలకుండా అక్కడే ఉంది
శూన్యంలో కూడ కదలకుండా అక్కడే ఉంది
మళ్ళీ కలం కింద పెట్టాడు

రాయలేనిది, లోపల మోయలేనిది చాలా వుంది !
దూరంగా ఏదో జరగడం వల్ల
అతని శరీరం బిగుసుకుపోయింది
ఆసక్తిగల రాత్రి ప్రయాణపు సంచిలా
బరువైన గుండె కొట్టుకుంటున్నా

బయట, చివరాఖరి వసంతం
ఆకుల నుంచి ఒక ఈల- ప్రజలా, పక్షులా?
వికసించిన చెర్రీ చెట్లు ఇంటికి వెళ్ళే మార్గంలో
భారీ వాహనాల వెన్నుతట్టాయి
వారాలు గడిచిపోతున్నాయి
నెమ్మదిగా రాత్రి వస్తుంది
చిమటలు అద్దంపై స్థిరపడతాయి
అవి ప్రపంచంపు పాలిపోయిన సందేశాలు

మూల రచయిత : స్వీడిష్‌ కవి
తోమస్‌ ట్రాన్స్ట్రోమర్‌
ఆంగ్ల అనువాదం : రాబర్ట్‌ బ్లై
తెలుగు సేత : డాక్టర్‌ పెరుగు రామకృష్ణ
98492 30443