మాట్లాడుతున్నవిద్యుత్తు శాఖ జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ బి.వెంకటసుబ్బయ్య
మెరుగైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
నెల్లూరు :వేసవి కాలంలో విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఫీజ్ ఆఫ్ కాల్స్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, 33 కె.వి., 11 కె.వి. ఫీడర్లలో పిఎంఐ నిర్వహించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు సరఫరా చేయడం ఎంతో సులభతరమౌతుందని విద్యుత్తు శాఖ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ బి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ భవన్ లో ఆయన జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ,అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అయినటువంటి జగనన్న కాలనీలు, గడపగడపకు మన ప్రభుత్వం, అగ్రికల్చరల్ సర్వీసులు రిలీజ్ చేయడంలో ప్రత్యేక శ్రద్ద కనపరచాలని ఆదేశాలు జారీ చేశారు. సబ్ స్టేషన్ మెయింటనెన్స్ క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేయాలని ఆదేశాలు జారీచేశారు. అగ్రికల్చరల్ సర్వీసులు ఫిబ్రవరి ఆఖరి వరకు నమోదు చేసుకున్న అందరికి మంజూరు చేశామని, మార్చి నెల లో నమోదు చేసుకున్న వారికి కూడ వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.వ్యవసాయ సర్వీస్ లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్, మెటీరియల్ డిస్టిక్ స్టోర్స్ లో అందుబాటులో ఉందని అధికారులు వెంటనే డ్రా చేయాలని తెలిపారు.ఈ మెటీరియల్ ను జిల్లాకు ఎక్కువుగా మంజూరు చేసిన ఏపి ఎస్పీడిసియల్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోష రావు కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. బిల్ స్టాప్ సర్వీసులను తనిఖీ చేయాలన్నారు. అగ్రికల్చర్ సర్వీసులకు ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ లింక్ చేయాలన్నారు. అగ్రికల్చర్ సర్వీస్ లకు ఉచిత విద్యుత్ కింద వినియోగదారులు చెల్లించే రూ.30 లు రుసుమును కూడా చాలా మంది రైతులు కట్టలేదని వాటిని వెంటనే వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు . ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్స్ దిమ్మెలు పడిపోయే స్థితిలో ఉన్న లేదా రోడ్డు ఎత్తు పెరిగి ట్రాన్స్ఫార్మర్స్ దిమ్మె ఎత్తు తగ్గి ఉన్న వాటి స్థానంలో కొత్తది నిర్మించాలని లేనిచో పిల్లర్ అయినా నిర్మించి వాటిపై ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల ప్రమాదాలను నియంత్రించడం సాధ్యమౌతుందన్నారు. అటవీ ప్రాంతం కి దగ్గరగా ఉండే డిటిఆర్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్) ఎత్తు తక్కువగా ఉంటే గుర్తించి వెంటనే వాటి స్థానంలో పిల్లర్ మౌంటెడ్ నిర్మించి ట్రాన్స్ఫార్మ్స్ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల అడవి జంతువులు ట్రాన్స్ఫార్మర్స్ కు తగిలి ప్రమాదాలకు గురికాకుండా ఉంటాయన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సేఫ్టీ కిట్స్ ధరించి విద్యుత్ పనులను చేయాలని, ప్రతి ఒక్క సెక్షన్ ఆఫీసుకు సేఫ్టీ కిట్స్ అందజేశామన్నారు. సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీస్ సర్వీసులను వెంటనే రిలీజ్ చేయాలని ఆలస్యం చేసినచో వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి పాల్గొన్నారు.










