ఫొటో : ఎంఎల్‌ఎ మేకపాటిని సన్మానిస్తున్న ఎంఎల్‌సి మేరిగ
మేకపాటిని కలిసిన ఎంఎల్‌సి మేరిగ
ప్రజాశక్తి - ఆత్మకూరు అర్బన్ : ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా నిలిచిన మేరిగ మురళీధర్ ఆదివారం ఆత్మకూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డిని కలసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలందరూ తనకు తోడుగా నిలిచారని, తాను ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అందరి సహాయ సహాకారాలతో ప్రజలకు సేవ చేయాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు.










