Feb 05,2023 21:23

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న

ప్రజాశక్తి - మడకశిర : నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు రోజురోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ చూసి తాడేపల్లి ప్యాలెస్‌ లో ఉన్న జగన్‌కి ఓటు భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే ఈరన్న అన్నారు. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ కొందరు అధికారులు, పోలీసులను తన చెప్పుచేతుల్లో పెట్టుకుని పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బంగారుపాళ్యంకు పాదయాత్ర చేరుకోగానే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారన్నారు . అనుమతులు ఉన్నా మూడు వాహనాలు సీజ్‌ చేశారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్‌ బాబు తో పాటు టిడిపి నాయకులు మీద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో వక్కలిగ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ విఎం.పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.