అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిసి, పిఎన్‌డిటి యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో హిందూపురం అడిషనల్ జడ్జి కె. శైలజ, డిఎస్‌పి యశ్వంత్, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, డిసిహెచ్‌ఎస్ తిప్పేంద్ర నాయక్, అనంతపురం న్యాయ సలహాదారులు ఆశాలత, ఆర్‌డిటి హెల్త్ డైరెక్టర్ సిర్రప్ప, డెమో బాబాఫక్రుద్దీన్, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










