క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న నాయకులు
సోమందేపల్లి : మండల కేంద్రంలోని ఎమ్మార్సీ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎపిసిపిఎస్‌ఇఎ రూపొందించిన క్యాలెండర్‌ను ఎస్‌ఐ విజరు కుమార్, ఎంఇఒ ఆంజనేయ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం లక్షల సిపిఎస్ ఉద్యోగుల మనోవేదనను అర్థం చేసుకోవాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రంగేష్ కుమార్, మండల అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్, గణేష్. ఉపాధ్యాయులు జవ్వాజి నాగరాజు, చంద్ర, సజ్జరాయప్ప, రామకృష్ణ, వినోద్, సంజీవ రాయుడు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.










