కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
ప్రజాశక్తి-అనంతసాగరం : కేంద్ర ప్రభుత్వం చేసే దుశ్చర్యలకు వ్యతిరేఖంగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరసనకు మద్దతగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేము హరిబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపక్షాన మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంట్‌లో అనర్హత వేటువేయడం ప్రతి ప్రజాగొంతుకను నులిమేయడమని విమర్శించారు. మోడీ చీకటి ప్రజారాజ్యం నుండి ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని దేశ ఔన్నత్యాన్ని రక్షించుకునేందుకు, స్వేచ్ఛ సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుడుకొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు కొంగుకాయని పార్టీ, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన పార్టీ కాంగ్రెస్ అని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ యుజన అధ్యక్షులు మెంతెం రామకృష్ణారెడ్డి, షేక్ మస్తాన్, తానికొండ శేషయ్య, షేక్ కరిముల్లా, ప్రవీణ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.










