Sep 01,2022 22:20

ప్రజాశక్తి -ఇబ్రహీంపట్నం
ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చి పర్మినెంట్‌ చేయాలని సిఐటియు మండల కార్యదర్శి మహేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు రాకపోవటం వల్ల కాంట్రాక్టు అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రన్నారు. శ్రమ దోపిడికి గురవుతున్న కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు సెప్టెంబర్‌ 9న ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో ఆఫీస్‌ దగ్గర , సెప్టెంబర్‌ 13న విజయవాడ కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర సిఐటియు నిర్వహించే ధర్నాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు వెంకట్‌, నాగేశ్వరరావు, సంపత్‌, శ్రీదేవి , సాయి రెడ్డి, శ్రీనివాస్‌ నాయక్‌, విటిపియస్‌ సిఐటియు యూనియన్‌ నాయకులు నాగరాజు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు