Jul 22,2022 20:03

నింగిలో మెరిసే చక్కని చుక్కలం
నేలపై విరిసే పూల మొక్కలం
సప్త వర్ణాల ఇంద్ర ధనస్సులం
ఉషోదయ కిరణాల ఉషస్సులం

కొమ్మ చాటున పాడే కోయిలమ్మలం
చెట్ల కింద ఊగే ముద్దుగుమ్మలం
మొక్కలు నాటే పచ్చని ప్రేమికులం
పెంచి పోషించే నిత్య శ్రామికులం

పక్షుల కమ్మని కిలకిలలం
మిణుగురుల మిలమిలలం
గలగలమని పారే సెలయేరులం
కళకళలాడే పచ్చని పైరులం
జలకాలాడే జలపుష్పాలం

ప్లాస్టిక్‌ లేని పుడమిని చూపిస్తాం !
అవనిపై పచ్చదనాన్ని చుట్టేస్తాం !!
ప్రకృతి బిడ్డలమని నిరూపిస్తాం !!!


- బోనగిరి పాండురంగ,
తొర్రూరు.