Feb 06,2023 21:16

గ్రామస్తుడితో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పార్థసారధి

ప్రజాశక్తి రొద్దం : జగన్‌పాలనలో ఎస్సీ, బిసిలకు ఒరిగిందేమీ లేదని టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. మండలంలోని పెద్దమంతూరు, రొప్పాల, కొత్తపల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జగన్‌ మోహన్‌రెడ్డి పాలన గురించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ రెడ్డి తుగ్లక్‌ నిర్ణయాల వల్ల రాష్ట్ర పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ నరహరి, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నాయకులు అశ్వర్థనారాయణ, రాము, శంకర్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.