జెవివి ఆధ్వర్యంలో వైద్య శిబిరం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : పట్టణంలోని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం షిరిడి సాయిరాం కళాశాల ఆవరణంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి (రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల) వారి సహకారంతో వైద్యశిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి షుగర్, బిపి ఉచిత వైద్య శిబిరం రూ.200లకే రెండు నెలలకు సరిపడా మందులను పంపిణీ చేస్తామన్నారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అతి తక్కువ ఖర్చుతో వైద్యం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ వైద్య శిబిరం చేపడతామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కామయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సంధాని, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎన్ రాజు, జివివి అధ్యక్షుడు వంటేరు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి మురళికృష్ణ, హరికృష్ణ, ఎల్‌కె ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌రాజ్, వాలంటీర్లు పాల్గొన్నారు.










