Feb 24,2022 19:33

చిరు జల్లులు కురియంగ
పిల్లలు చేరిరి సందడిగ
గిర్రున తిరిగిరి గుండ్రంగ
బాలలందరు ఆటలాడంగ

ఆకసాన రంగులు విరియంగ
చూడ వచ్చిరి కనుల విందుగ
ఎలా వచ్చెనని అడగంగ
చెప్పెను మామా చక్కంగ

తుంపర చినుకులు కురవంగ
సరిగ్గా సూర్యుని ఎదురుంగ
ఇంద్రధనస్సు పుట్టు సుందరంగ
అవనికి అందం ఇచ్చెనుగా

సూర్య కిరణాలు తాకంగ
చినుకులగుండ ప్రసరించంగ
ఏడు రంగులు పూచెనుగా
ఆకాశమంతా అందంగా

పిల్లలు చేసిరి ఊయలగ
గంతులు వేస్తూ ఊగిరిగా
ఆకాశమంతా చూసిరిగా
ఊహల్లో విహరించిరిగా
- ఆవుల చక్రపాణి యాదవ్‌
99633 50973