Aug 24,2022 08:20

కఠినముగా మాట్లాడిన
గాయపరచు హృదయము
మధురముగా సంభాషించిన
మైమరిపించు మనసును

ఎల్లప్పుడు సున్నితముగా
మాట్లాడిన చాలును
మర్యాద పెరుగును
గౌరవము లభించును

తల్లి మనసు నొప్పించక
నాన్న మనసు గాయపరచక
మధురముగా మాట్లాడము
మన్ననను పొందుము

కఠినోక్తులు ముళ్ళని
హితోక్తులు విరులని
ఇకనైనా తెలుయుము
మధురముగా భాషించుము
- జక్కల శివ, ఇంటర్మీడియట్‌
70932 25602