విరాళాలు సేకరిస్తున్న దృశ్యం
ఎన్‌టిఆర్ నగర్‌లో 'ప్రజా విరాళాల సేకరణ'
నెల్లూరు :ప్రజా ఉద్యమాల నిర్వహణకు విరివిగా విరాళాలు ఇచ్చి సిపిఎం ను ఆదరించాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. బుధవారం ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడే ఉద్యమాల రథ సారధి సిపిఎం '' ప్రజా విరాళాల సేకరణ '' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో ప్రజా సమస్యల పై నిరంతరం ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్వాసితుల సమస్య, పింఛన్లు రద్దుకు వ్యతిరేకంగా, కార్మికుల సమస్యలపై, మహిళా సమస్యలపై, హైవే నుండి నగరంలోకి వచ్చే జంక్షన్ లలో ఫ్లై ఓవర్ లు ఏర్పాటు చేయాలని, టిడ్కో అపార్ట్మెంట్ లు, జగనన్న స్థలాలు సమస్యల పై నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.ప్రజా ఉద్యమాలు బలోపేతం చేయుటకు ప్రజల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించే కార్యక్రమం నగరంలో నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు తమ మద్దతు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి. సూర్య నారాయణ, శాఖ కార్యదర్శి టి. నారాయణ, అన్నం పెంచలయ్య,కర్తం బాబు,ఐ. శేషయ్య పాల్గొన్నారు.










