ప్రజాశక్తి -కందుకూరు :తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కంచర్ల శ్రీకాంత్‌ను హైదరాబాద్ కూకట్‌పల్లిలో తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి విచ్చేసిన సందర్భంగా తమ మిత్రులు కందుకూరు తెలుగు యువత నాయకులు నన్ను ఘనంగా సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు తనకు ఎంతగానో సహకరించారని, వారి సహకారాన్ని జీవితంలో ఎన్నటికీ మరువలేనని శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, త్వరలోనే రామరాజ్యం వస్తుందని అది ఎమ్మెల్సీ ఎన్నికలతో వైసిపి పతనం ప్రారంభమైందని తెలిపారు. అనంతరం తెలుగు యువత ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను, ఇంటూరి రాజేష్‌ను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికష్ణ, తెలుగు యువత నాయకులు తానికొండ ఆంజనేయులు, పొడపాటి అశోక్, గురుబ్రహ్మం, టీడీపీ నాయకులు అట్లూరి దీపక్ చౌదరి ఉన్నారు










