Apr 24,2022 20:18

ఎండలు బాగా మండే కాలం
నూతులు చెరువులు ఎండే కాలం
చెమటలు బాగా పట్టే కాలం
వడ దెబ్బతో వణికే కాలం
దాహం బాగా వేసే కాలం
దేహం నీటిని కోరే కాలం

పిల్లల్లారా.. పాపల్లారా
చాలా చాలా జాగ్రత్త
ఎండకు ఎక్కువ తిరగొద్దు
టోపీ గొడుగు వాడండి
నీడన ఎక్కువ మెలగండి
నీటిని బాగా తాగండి

పళ్ళరసాలు తాగిన మేలు
ఉప్పు కలిపిన మజ్జిగ చాలు
పశువులు పక్షుల కోసం
నీటిని ఒక చోట పెట్టండి
ఉక్కపోతలో చిక్కొద్దు
ఊరికే ఎండలో తిరగొద్దు

ఇది ఎండా కాలం
ఎండలు బాగా మండే కాలం
పిల్లల్లారా.. పాపాల్లారా
చాలా చాలా జాగ్రత్త!
- గరిమెళ్ళ.వి.ఎస్‌.నాగేశ్వరరావు
93816 52097