ఇంట్లొ చిట్టెలుక దూరింది
అటూ ఇటూ తిరిగింది
ఎంత తరిమినా కాని
ఇంటి నుంచి పోనంది
ఇంట్లో స్థావరం వేసింది
అవీ ఇవీ కొరికింది
కళ్ళముందే తిరిగింది
కొట్టబోతె ఉరికింది
బియ్యం సంచి కొరికింది
బట్టలలో దూరింది
అమ్మ చీరను కొట్టింది
అమ్మకు చిరాకు వేసింది
ఎలుకల బోను కొనింది
టమోటో, అన్నం వేసింది
ఎలుక తిరిగె ప్రదేశంలో
వాటంగా దాన్ని పెట్టింది
చిట్టెలుక మహా తెలివైనది
ఎర బోనులో దూరలేదు
మందు పెట్టినా తినలేదు
మ్యాట్ పై కూడా వెళ్ళలేదు
అమ్మకు కోపం వచ్చింది
పక్కన పిల్లిని తెచ్చింది
మ్యావ్ మంటూ తిరిగింది
ఎలుక కొరకు చూసింది
ఎలుకకు భయం వేసింది
పిల్లికి దొరకక తిరిగింది
ఇంట్లో దూరను కన్నం లేక
ఎక్కడికో పారిపోయింది !
- ఆవుల చక్రపాణి యాదవ్
99633 50973










