Feb 04,2023 22:21

కవాతు నిర్వహిస్తున్న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు

ధర్మవరం టౌన్‌ : ప్రజాభద్రత, విశ్వాసాలకు భరోసానిస్తూ జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ ఆదేశాల మేరకు శనివారం ధర్మవరం పట్టణంలో పోలీసు కవాతు నిర్వహించారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాల కవాతు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ప్రారంభమై కళాజ్యోతి, ఎన్టీఆర్‌, గాంధీసర్కిల్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో హాకీంపేట 99వ బెటాలియన్‌ ర్యాపిడ్‌ యాక్షన ఫోర్స్‌ డిప్యూటీ కమాండెంట్‌ వినోద్‌, వన్‌ టౌన్‌, టూటౌన్‌ సిఐలు సుబ్రమణ్యం, రాజా, ట్రాఫిక్‌ సిఐ వహీద్‌బాషా, ఎస్‌ఐలు మహమ్మద్‌ రఫీ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.