ప్రజాశక్తి-తిరువూరు: జాతిపిత మాహాత్మా గాంధీని, కమ్యూనిస్టులను హంతకలుగా, దేశ ద్రోహులుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న అర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ముదిగొండ దుర్గాప్రసాద్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు బి.వెంకటేశ్వ రరావు, చప్పిడి సురేష్, మరకాల ఇజ్రా యెల్, ఎస్.కె.సత్తార్, సాంబారు వెంక టేశ్వర్లు, జెట్టి శ్రీనివాసరావు తదితరులు తిరువూరు పోలీస్ స్టేషన్‌లో, ఆర్డిఓ కార్యాలయంలో అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశా రు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారితో గాంధీ కుమ్మకయ్యాడని, స్వార్ధపరుడని, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేవాడని, హంతకుడని చిత్రీకరించిన దుర్గాప్రసాద్ గాంధీని కాల్చిచంపిన గాడ్సేనే అసలైన మహాత్ముడని చరిత్రను వక్రీ కరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. కమ్యూనిస్టులను కూడా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ, దేశ చరిత్రను వక్రీకరిస్తూ దేశ ప్రజలను, యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.










