Aug 30,2022 23:01

ప్రజాశక్తి-తిరువూరు: నగర పంచాయతీ సాధారణ సమావేశం కౌన్సిల్‌ హాల్‌లో చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఎజెండాలోని మొత్తం ఐదు అంశాలు ఆమోదం పొందిన తరువాత ప్రతిపక్ష టిడిపి సభ్యులు నాళ్ల సురేంద్ర, అబ్దుల్‌ హుస్సేన్‌ డ్రెయినేజీ పూడికతీత పనులపై అధికార పక్షాన్ని నిలదీశారు. బోసుబొమ్మ సెంటర్‌ నుండి బైపాస్‌ రోడ్డు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రెయినేజీలో పూడికతీత పనులను పారిశుధ్య కార్మికులతో కాకుండా ప్రైవేట్‌ వ్య క్తులు తీస్తున్నారని, వేలల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నిలదీశారు. డ్రెయినేజీపై వేసిన సిమెంట్‌ ప్లేట్లు, స్లాబ్‌లు జెసిబితో పగలగొట్టాలని, అలాకాకుండా తీయమని ఆడిగితే తాుము లోపలికి వెళ్లి పూడిక తీయలేమని పారిశుధ్య కార్మికులు చెప్పటంతో యజమానులే డబ్బులు ఇచ్చి బయట వ్యక్తులతో తీయించుకుంటున్నారని, దీనిలో తప్పేముందని అధికార పక్షానికి చెందిన సభ్యులు పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకటరెడ్డి సమాధానం చెప్పారు. అధికార పక్షం ప్రజల నుండి డబ్భులు దండుకుంటుందని, ఇంతకంటే నీచమైన చర్య మరొకటి ఉండదని టిడిపి సభ్యులు విమర్శించారు.