Oct 16,2022 15:07

ప్రజాశక్తి-హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని వాసవి రోడ్లో గల శ్రీనివాస టిఫిన్ సెంటర్ సుధీర్ సహకారంతో శాంతినగర్ ఐదో క్రాస్ నందు మరియు శ్రీకంఠపురం, గుడ్డం దోబి ఘాట్ వరదల వల్ల నీట మునిగిన ఇండ్ల దగ్గరకు పోయి సిపిఎం నాయకులు భోజన పట్నాలను అందించారు. 120 మందికి ఆటోలో వేసుకుని పోయి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం హిందూపురం పట్టణ కార్యదర్శి వినోద్ కుమార్ మరియు పట్టణ కమిటీ సభ్యులు నరసింహప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, భగత్ సింగ్ ఆటో యూనియన్ పట్టణ కార్యదర్శి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ హిందూపురం పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్, పట్టణ ఎస్ఎఫ్ఐ నాయకులు జస్వంత్, శివ పాల్గొన్నారు.