అదిగదిగో చందమామ
ఆకసాన చందమామ
అందమైన చందమామ
చుక్కల్లో చందమామ
చక్కనైన చందమామ
వెన్నముద్ద చందమామ
వెండిబంతి చందమామ
వెన్నెల దొర చందమామ
చల్లనయ్య చందమామ
చలువ జ్యోతి చందమామ
హాయినిచ్చు చందమామ
రేరాజూ చందమామ
కలువసామి చందమామ
కవుల కవిత చందమామ
చిన్నారుల మేనమామ
చందమామ చందమామ!
- డి.కె.చదువులబాబు
94407 03716










