Apr 01,2023 21:30

ఫొటో : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

'చలో ఢిల్లీ' వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : కార్మికుల, కర్షకుల ఐక్యతతో 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ సి.ఐ.టి.యు. నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో అందుకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ 5న కార్మికుల కర్షకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం వాల్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల కర్షకుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య పెరిగి పోతుందన్నారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు, కర్షకులు, రైతులు వ్యవసాయ కార్మికులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పట్టణ సహాయ కార్యదర్శి పెంచలనరసింహం మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనాలు, నిరుద్యోగుల సమస్య పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వంత పాడుతూ పరిపాలన సాధిస్తుందని, దొందూదొందుగానే ఉన్నాయన్నారు. కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పోరాటాల ద్వారానే ఈ రెండు ప్రభుత్వాలకు తగినగుణపాఠం చెప్పాలన్నారు. కార్మికులు రైతులు సమస్యల పరిష్కారం కోసం సమక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి మధుసూదన్‌ రావు, పాశం కోటేశ్వరరావు, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.