May 09,2022 07:29

నిరంకుశ ప్రేమతో
వంచనతో మంచిగా
ప్రజాస్వామ్య ముసుగులో
తేనెమాటలతో తీపి అర్థాలను సానబెట్టి
చల్లని విషంగా చెవిలో పోసి ...

చేతులకు మత్తెక్కించి గుంజిన అధికారంలో
ఏలికది పాముమెలికలే పాలనది పడగ నీడే

ప్రజలే చావుకు దగ్గరగా
సమాధైన ఆశలను తలుచుకుని
మెత్తని పోట్లుతో నిప్పులదారిలో గడ్డకట్టిన కన్నీళ్లుతో

మింగలేక, కక్కలేక అపరాధావమానాన్ని
అంకుశంగా మలచి ఆయుధంగా దాచి
తప్పును కడిగేసుకుని
మోసాన్ని వధించాలని ఎదురుచూస్తుంది !
 

- చందలూరి నారాయణరావు
97044 37247