చిన్ని చేతులతో మొక్కలు నాటుదాం
నేలను పునీతం చేద్దాం
మొక్కలు చేప్పే మాటలు విందాం
నిత్యం శ్రద్ధగా చూద్దాం
పెరిగే వరకు కాపాడుకుందాం ...
చక్కగా రోజూ స్నానం చేయిద్దాం
చుక్క చుక్క నీటిని పోద్దాం
పశువులు రాకుండా కంచె వేద్దాం
దినదినము చూస్తు ఉందాం
కంటికి రెప్పలా చూసుకుందాం...
చీడ పురుగుల నుండి రక్షించుకుందాం
పసిపాపల్లా సాకుదాం
ఆకుల వచ్చే కొద్దీ ఆనందిద్దాం
రెమ్మలు వస్తుంటే ఎరువులు వేద్దాం
పెరుగుతుంటే ఆకాశం వైపు చూద్దాం..
చెట్టుగా మారే వరకు చేదోడుగా ఉందాం
చెట్టుపై పక్షులు చేరితే వినోదం తెద్దాం
చెట్టు నిండా లో ఆడుకుందాం
చెట్టు ఎక్కి పండ్లు ను తెంపు కుందాం
చెట్టును భావితరాలకు బహుమతి ఇద్దాం...
- కొప్పుల ప్రసాద్
98850 66235










