Aug 22,2022 06:59

ధరిత్రిని మించిన క్షమాగుణం
ప్రతి ఎరుగని దయాదాక్షిణ్యమ్‌
నాగరిక చరిత్రలోనే నిలిచే వైనం
గుజరాత్‌ ప్రభుత చూపిన పుణ్యం
అజరామరమైన అపకీర్తికి మార్గం!

క్రూర నేరము చేసిన వారకు
కారాగారమాచ తప్పు తప్పు!
జీవితకాలపు వారి జైలు జీవితం
సమాజానికే ముప్పు ముప్పు!
శిక్ష సడలించి, స్వేచ్ఛ నొసగితే
దేశ ప్రతిష్టకు గొప్ప మెప్పు

రండి! పూలదండలు పట్టుకు రండి!
బాధితుల కన్నీటి గుండెల్ని తొక్కి రండి!
విదురులూ, నాగరిక యోధులూ, న్యాయ కోవిదులూ..
బధిరులై మిగిలే వేళ
జైలు బయట వేచి ఉందాం!
స్వేచ్ఛా రాబందులకు స్వాగతమిద్దాం
జేకొట్టి హారతులిద్దాం!
- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం, 94408 36931