కవాతు నిర్వహిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-హిందూపురం : సమస్యత్మక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులతో ర్యాలీ నిర్వహించినట్లు కేంద్ర రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ వినోద్ పేర్కొన్నారు. కేంద్ర రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రిజినల్ ఎస్పీ వినోద్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో పోలీస్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు ఫ్లాగ్ మార్చ్( పోలీస్ కవాత్)ను అదునాతునమైన ఆయుధాలతో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు.










