May 23,2022 08:30

మనిషి మనిషిలో యుద్ధం
పక్క మనిషితో యుద్ధం
ఎడతెగని యుద్ధం
మధ్యన దొరికిన విరామంలోనూ
తదుపరి యుద్ధానికి సన్నద్ధం
అజ్ఞానంపై పోరు మాత్రం నిషిద్ధం
హేతువు.. కేవలం స్వార్థం
లోపించిన సౌహార్దం
అయ్యో, మానవుడా!
మూఢ నిద్దుర వీడవేల?
బుద్ధుడి మార్గం చూడవేల?
స్వయం సమృద్ధినీ, సంఘం వృద్ధినీ సాధించవేల?
 

- డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ
94408 36931