Jun 06,2022 06:47

ప్రేమ నిర్వచనం
అనేక విపర్యయాల నడిమి ఊగిసలాట
అది ఓడిపోయి గెలుస్తుందా
గెలిచి ఓడిపోతుందా
అన్నంత సులువు కాదు తేల్చడం
గొడ్డళ్ళు
వేటకొడవళ్ళు
ప్రేమకసలు సంబంధించని వస్తువులు
నిజానికి ప్రేమ
ఓడనూ ఓడదు
గెలవనూ గెలవదు
నిరతమూ ఉంటుందంతరంగంలో
అలా... ఉన్నంతవరకు ప్రాణం!
- ఏనుగు నరసింహారెడ్డి