- బరిలో 409మంది
- మార్చి 4న డబ్ల్యుపిఎల్ ప్రారంభం
ముంబయి: బిసిసిఐ ప్రతిష్టాత్మక నిర్వహించబోతున్న మహిళల ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) వేలంకు షార్ట్‌లిస్ట్ సిద్ధమైంది. ఆరంభ డబ్ల్యుపిఎల్ కోసం మొత్తం 1,525మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా.. బిసిసిఐ 409మందితో షార్ట్ లిస్ట్‌ను తయారు చేసింది. ఇందులో 246మంది భారత మహిళా క్రికెటర్లు ఉండగా.. 163మంది విదేశీ క్రీడాకారులున్నారు. వీరిలో 8మంది అసోసియేట్ దేశాలకు చెందిన వారున్నారు. అలాగే 202మంది అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు ఆటగాళ్లు కాగా.. 199మంది అరంగేట్రం చేయని క్రీడాకారులు, మరో 8మంది సంయుక్త దేశాల తరఫున ఆడిన అనుభవముంది. మొత్తం 90 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. వీటిలో 30 స్లాట్స్‌ను విదేశీ క్రికెటర్లకు కేటాయించారు. వేలం రేసులో నిలిచి క్రికెటర్లలో రూ.50లక్షల అత్యధిక బేస్ ధరతో 24మంది ఉండగా.. భారత్ నుంచి ఈ బేస్ ధరలో షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ తదితరులు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో ఎల్లిసే పెర్రీ(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్(ఇంగ్లండ్), సోఫీ డెవిన్(న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్(వెస్టిండీస్) వంటి 13మంది స్టార్ ఆటగాళ్లు రూ.50లక్షల బేస్ట్ ధరతో వేలం బరిలో దిగనున్నారు. ఇక మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) మార్చి 2నుంచి 26వరకు జరగనుంది. తొలి సీజన్‌లో 5జట్ల మధ్య మొత్తం 22మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రాబౌర్న్, డి.వై. పాటిల్ స్టేడియాల్లో డబ్ల్యుపిఎల్ జరగనుంది.
- మార్చి 4న ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ ముంబయి వేదికగా మర్చి 4న మొదలు కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. ఈ జట్లు 22 మ్యాచ్‌లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.










