వాళ్లేమో పాలు పోస్తున్నారు
మరి మనం!?
మనమీద మనమే
నీళ్ళు పోసుకుంటున్నాం
విజ్ఞతకు వదిలేద్దామా అంటే
ఉన్న కాస్త జీవితం... జీతం
ఏమౌతుందో... ఏమో..?
ఎవరినైనా ఎందుకు నిందించాలి?
ఎవరి జీవితం వారిది
ఎవరి జీతం వారిది
ఎవరి బతుకు పోరాటం వారిది!
అయినా
నాకు నాయకుడు కావాలి
నా బతుక్కి భద్రత కావాలి
అంటూనే ఉంటాం
అణిగిమణిగి బతుకుతూనే ఉంటాం
మన హక్కుల్ని
మనచేతులారా మనమే
కాలరాసుకుంటూ ఉంటాం!
- కాసర్ల శ్రీను










