కారకాస్ : నేషనల్ ఎలక్టోరల్ నామిషన్ కమిటీకి ఎంపికైన 21 మంది సభ్యులు గురువారం జాతీయ అసెంబ్లీలో ఎలక్టోరల్ అధికారులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల నామినేషన్ల కమిటీకి ఎంపికైన వీరిలో 11 మంది డిప్యూటీలు, 10 సివిల్ సొసైటీ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 295 ప్రకారం జాతీయ ఎన్నికల మండలి అధికారుల్లో ఉత్తమమైన ప్రతిభను కనబరిచిన వీరందరినీ ఎలక్టోరల్ నామినేషన్‌కి కమిటీకి నియమించడం జరిగింది' అని పార్లమెంట్ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ అన్నారు. నూతనంగా ఎన్నికలైన ఈ 21 మంది సభ్యులకు రోడ్రిగ్జ్ అభినందనలు తెలిపారు. జూన్ 15వ తేదీన ఎలక్టోరల్ నామినేషన్ కమిటీ అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త ఎలక్టోరల్ కమిటీని శాసనసభ ఎన్నుకొంది. కాగా, వెనిజులాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.










