Jul 03,2023 17:20

మాస్కో : క్రిమియా అధిపతి సెర్గీ అక్సియోన్‌వ్‌ను హతమార్చేందుకు ఉక్రెయిన్‌ స్పెషల్‌ సర్వీసెస్‌ చేసిన దాడిని రష్యా ఎఫ్‌ఎస్‌బి (ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌) అడ్డుకుంది. సెర్గీపై హత్యాయత్నానికి ప్రయత్నించాలని చూసిన ఓ అనుమానితుడిని పేలుడు పదార్థాలు ఉంచిన ప్రదేశం నుంచి బయటకు తీసి అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఎస్‌బి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇక ఈ విషయంపై సెర్గీ హత్యాయత్నంపై ఉక్రెయిన్‌ సర్వీసెస్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అని రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ వెల్లడింది.
కాగా, ఈ హత్యాప్రయత్నాం కేసులో అరెస్టయిన వ్యక్తి 1988లో జన్మించాడని, అతను రష్యన్‌ జాతీయుడని, ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎస్‌బియు) అధికారులచే నియమించబడ్డాడు అని ఎఫ్‌ఎస్‌బి తన ప్రకటనలో వెల్లడించింది.