Jun 18,2023 11:54

బీజింగ్‌ (చైనా) : ఆర్థిక మాంద్యం తట్టుకోలేక పలు కంపెనీలు ఉద్యోగులను తీసేసిన ఘటనలు విదితమే.. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. సహజంగా ఉద్యోగుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే ఉద్యోగాల్లో నుండి తీసేస్తారు. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం విచిత్రమైన నిబంధనను జారీ చేసింది.. దీంతో కొందరు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు... ఇంతకీ ఆ నిబంధన ఏమిటంటే ....

                                                                    జూన్‌ 9న ఆదేశాలు జారీ..

చైనాలోని ఓ కంపెనీ షరతు పెట్టింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులెవరూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దని నిబంధన విధించింది. అలాగే విడాకులు కూడా ఇవ్వొద్దని తెలిపింది. వీటిని అతిక్రమించినవారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను కంపెనీ జూన్‌ 9 న జారీ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

                                                                    సంస్థ ప్రతినిధి వివరణ...

అయితే, తాజాగా ఆ కంపెనీ పెట్టిన ఈ నిబంధనపై చైనాలోని సోషల్‌ మీడియాలో విస్తఅతంగా చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియా దఅష్టిని ఆకర్షించింది. కంపెనీ అంతర్గత నిర్వహణను మెరుగుపర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కుటుంబానికి విశ్వాసంగా ఉండటం, దంపతుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పే సంస్కఅతిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి వివరించారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటేనే ఉద్యోగుల పనితీరు కూడా బాగుంటుందని భావించే ఈ నిబంధనను రూపొందించినట్లు తెలిపారు.

                                  వివాహేతర సంబంధాలపై నిషేధాన్ని చేర్చడం చట్ట సమ్మతం కాదు : న్యాయవాది

కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా సోషల్‌ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై నిబంధనలను రూపొందించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇలాంటి నిబంధనల వల్ల కుటుంబ విలువలు నిలబడతాయనే వాదన కూడా కొంతమంది నుంచి వినిపిస్తోంది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న 'వీఅండ్‌టీ లా' సంస్థకు ఓ లాయర్‌ మాత్రం న్యాయపరంగా ఈ నిబంధన సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఓ ఉద్యోగిని తొలగించడానికి అతని పనితీరు ఆధారిత కారణాలు మాత్రమే న్యాయస్థానంలో చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. కంపెనీ నిబంధనల్లో వివాహేతర సంబంధాలపై నిషేధాన్ని చేర్చినా.. అది చట్ట సమ్మతం కాదని తేల్చి చెప్పారు.