పారిస్ : ఫ్రాన్స్ పోలీసులు మంగళవారం నహేల్ అనే 17ఏళ్ల యువకుడిని కాల్చి చంపారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా గడచిన నాలుగురోజులుగా ఆ దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగతున్నాయి. ఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన 1,311 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. నహేల్ హత్యకు వ్యతిరేకంగా నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో శుక్రవారం రాత్రికి రాత్రే ఈ హింసను అణచివేసేందుకు ప్రభుత్వం 45 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపింది.
కాగా, పోలీసు కాల్పుల్లో మృతి చెందిన నహేల్ అంత్యక్రియలు శనివారం జరిగాయి.










