Israeli raid : జెనిన్ శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి : ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు
జెరూసలేం : ఇజ్రాయెల్ దళాలు సోమవారం తెల్లవారుజామున జెనిన్ శరణార్థుల శిబిరంపై జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇక ఈ ఘటనలో కనీసం 29 మంది గాయపడ్డారనిపాలస్తీనా న్యూస్ ఏజెన్సీ వాఫా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... సోమవారం ఉదయం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైనికులు జెనిన్ శరణార్థుల శిబిరంలోకి ప్రవేశించి, మందుగుండు సామ్రాగిని పేల్చడం స్టన్ గ్రెనేడ్ల, విషపూరిత వాయువులను ప్రయోగించడం చేశారు. దీంతో శరణార్థుల శిబిరంలోని ముగ్గురు మృతి చెందారు. చనిపోయిన ముగ్గురు పాలస్తీనియన్లేనని వారు ఖలీద్ దుర్విష్ (21), కస్సామ్ సరియా (19), అహ్మద్ సకర్ (15)గా పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ గుర్తించింది. మృతుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నారని పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, ఈ ఘటనపై ఇజ్రాయెల్ మిలటరీ బాధ్యత వహించింది. ఈ ఘటన అనంతరం పాలస్తీనా మిలటరీ దళాలు.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను అరెస్టు చేసిన ఫలితంగానే ఈ భారీ కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. అరెస్టు చేసిన ఇద్దరు అనుమానితుల్లో ఒకరు జైలులో ఉన్న హమాస్ నాయకుడి కుమారుడు అని మీడియా ప్రతినిధి ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.










