Apr 01,2023 19:52

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
23న ఎపి వ్య.కా.స.జిల్లా మహాసభలు
నెల్లూరు:ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈనెల 23వ తేదీ ఆదివారం యల్లాయపాళెం ప్రాంతంలోని కడివేటి వెంకయ్య ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నంది పోగుల రమణయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ శ్రమజీవుల కోసం భూస్వాముల పెత్తందారుల దోపిడీల ను ఎదిరించే క్రమంలో జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడిందన్నారు. ఈ సంఘం నేడు దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈనెల 23వ తేదీ యల్లాయపాళెంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మహాసభలకు ముఖ్యఅతిధిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కె. రామకష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం ఏపి అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌సి జల్లి విల్సన్‌, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్‌ లతోపాటు సిపిఐ, సిపిఎం ,తెలుగుదేశం పార్టీలో చెందిన పలువురు నాయకులు వివిధ సంఘాలకు చెందిన నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు ఈ మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అనరతరం జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్‌ నాయకులు వి రామరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్‌ షాన్వాజ్‌, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు షేక్‌ ఫరీదా ఎస్‌.కె ఎస్దాని రూరల్‌ మండలం సిపిఐ సహాయ కార్యదర్శి ఆదినారాయణ ఈ వై ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ మున్నా తదితరులు పాల్గొన్నారు.