May 06,2023 21:58

ఫొటో : ఇన్‌ఛార్జి కమిషనర్‌ బి.నాగేశ్వరరావుతో సిబ్బంది

ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బి.నాగేశ్వరరావు
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : ఆత్మకూరు ఇన్‌ఛార్జి మున్సిపల్‌ కమిషనర్‌గా బల్లి నాగేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇక్కడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.రమేష్‌ బాబు సెలవుల్లో ఉండడంతో బి.నాగేశ్వరరావు కమిషనర్‌ను ఆత్మకూరు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నాగేశ్వరావు ప్రభుత్వం ఇక్కడికి ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బదిలీ చేశారు.
వైసిపి నాయకులు, మున్సిపల్‌ కార్యాలయ సిబ్బంది ఆయనను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఏఈ ప్రసాద్‌, ఆర్‌ఐ ఖాసీం, సిబ్బంది, వైసిపి నాయకులు పాల్గొన్నారు.