Jun 24,2023 19:25

ఇంటింటి సర్వేలో పాల్గొన్న సిఇఒ

ప్రజాశక్తి- గుడ్లూరు :మండలంలోని మోచర్లలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మోచర్లలో జరుగుతున్న ఇంటింటి సర్వేలో జిల్లా సిఇఒ చిరంజీవి శనివారం పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అందని వారికి వెంటనే అందించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యల తోటి భూ సమస్యలు ఇతర సమస్యలు పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను సిఒ ఆదేశించారు.