Jun 22,2023 18:41

మేనిఫెస్టోపై ప్రచారం చేస్తున్న తెలుగు మహిళలు

ప్రజాశక్త - కందుకూరు : టిడిపి మినీ మేనిఫెస్టోపై కందుకూరు పట్టణంలోని 1వ వార్డులో టిడిపి నేతలు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు దివి సౌభాగ్య ఆధ్వర్యంలో మహిళలు నాయకులు ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలోని ప్రజలకు అంశాలపై అవగాహన కల్పించారు. టిడిపి అధికారంలోకి రాగానే, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పథకాల అమలు చేస్తారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్‌ మహిళా కమిటీ అధికార ప్రతినిధి బత్తిన ఆదెమ్మ, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షులు ముచ్చు వేణు, పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పులి నాగరాజు, పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, షేక్‌ మమోషా, కత్తి శ్రీను, ఏలూరు నాగేంద్రబాబు, మానికల శ్రీను, మానికల ఏడుకొండలు, రావి సరిత, కంసాని మయూరి, రసూల్‌ బి ఉన్నారు.