మాట్లాడుతున్న డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు
గహ ఇంటి నిర్మాణాలు మరింత వేగవంతం
కొడవలూరు:పట్టణంలో జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు నాయకులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17,18 తేదీల్లో కొడవలూరులో ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆ రోజు కల్లా అ సంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి ఎమ్మెల్యేచే ప్రారంభించేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణంలోని ఇరిగేషన్ వంతెన ఆర్‌ఒ ప్లాంట్ పూర్తి చేయాలని చెప్పారు. సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి పనులు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపిడిఒ పి.సుబ్రహ్మణ్యం ఎంఇఒ వసంతకుమారి, హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఎఇలు పి. సురేష్ కుమార్ ఏ. రమేష్, ఎపిఎంఎస్ రుక్మిణీ, సర్పంచ్ ఎన్ కామాక్షి, పంచాయతీ కార్యదర్శి రాధాకష్ణ, ఎంపీటీసీ ఎన్ ప్రతాప్, నాయకులు సునీతమ్మ, తిరుపతయ్య, పి.రవి పాల్గొన్నారు.










