Jan 08,2023 21:58

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి : ఎపి జెన్కో (శీదామోదరం సంజీవయ్య ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం) ప్రయి వేటీకరణకు వ్యతిరేకంగా 350 రోజుల నుంచి జరుగుతున్న పోరాటానికి అఖిలభారత విద్యుత్‌ ఇంజినీర్ల ఫెడరేషన్‌ అధ్యక్షులు శైలేంద్ర దుబే, అఖిలభారత నాయకులు, రాష్ట్ర నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎపిపిఎస్‌ఇబి ఇంజినీర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎపి జెన్కో వద్ద ఆదివారం నిర్వహించిన ర్యాలీ అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగించారు. ఎపి జెన్కో జెఎసి, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని అభినందించారు. ఉద్యమాన్ని కొనసాగించాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఎపి జెన్కో పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ ఎం మోహన్‌రావు,, గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు డి. సూరిబాబు, నాయకులు రామయ్య ,సుమంత్‌ ,నాగయ్య, జన్కో జేఏసీ నాయకులు సిహెచ్‌. ఆదిశేషయ్య, నాగరాజు, భాస్కర్‌ ,అనిల్‌ ,నక్క మోహన్‌ రావు ,ఆదిలక్ష్మి తదితరులు వినతి పత్రం అందజేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.