పుట్టపర్తి అర్బన్ : ప్రతి ఒక్కరూ పొదుపుగా విద్యుత్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ బసంత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ఎనుములపల్లి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి విద్యుత్ కార్యాలయం వరకు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంధన పొదుపుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇళ్లలో అనవసరంగా బల్బులు ఫ్యాను వినియోగించరాదన్నారు. ఏసీలు తక్కువగా ఉపయోగించాలని కిటికీలు తెరుచుకుని సహజసిద్ధమైన గారిని పీల్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఇఇ మోహన్, ఎఇ కోమలి, డిఇ శర్వాణన్, విద్యుత్ శాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ బసంత్‌కుమార్, అధికారులు










