ఇళ్లు మంజూరు చేయాలని సిపిఎం వినతి
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్లు మంజూరు చేయకపోవడంతో కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయని బుధవారం మండలంలో పర్యటనకు వచ్చిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మంగళ పుల్లయ్య వినతిపత్రం అందజేశారు. స్థలాల్లో పెరిగిన కంపచెట్లు తొలిగించి నివాసయోగ్యంగా చేయాలని, ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. మండల కార్యదర్శి అన్వర్‌బాషా మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో కరెంట్, మంచినీటి వసతులు కల్పిస్తే కనీసం పేదలు గుడిసెలు అయిన వేసుకొని నివాసం ఉంటారని, అనేక మంది అద్దెలు ఇళ్లలో ఉంటూ అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటి స్థలాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కాలనీ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు డాక్టర్ సుబ్బారాయుడు, ఉప్పలపాడు మస్తాన్, రాటకొండ పెంచల నాయుడు, వెంకటేష్, రవి, తదిరులు పాల్గొన్నారు.










