ఫొటో : నిర్మాణాలను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ శీనానాయక్
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి కావలి ఆర్‌డిఒ శీనా నాయక్ వెల్లడించారు. మంగళవారం మండలంలోని నార్త్ ఆములూరు, బట్రకాగోల్లు, అల్లూరు తదితర లే అవుట్లను పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీరామకృష్ణ, ఎంపిడిఒ శ్రీదేవి, అల్లూరు నగర పంచాయతీ కమిషనర్ ఫణికుమార్, సీనియర్ అసిస్టెంట్ సుధీర్, తదితరులున్నారు.










